AP Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని (Annadata Sukhibhava Scheme) ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ. 20 వేలు అందించనున్నారు. మొత్తం 3 విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ. 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి మొత్తం రూ. 20,000 ఆర్థికసాయం అందిస్తారు