గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం రాష్ట్రంలో వేల కుటుంబాలను నాశనం చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రతి నెల రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు, రూ.3,500 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ బయటపెట్టిందన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన హామీ వెనుక అసలు కథ ఇదేనా అని జగన్‌ను ప్రశ్నించారు. మీ అనుచరుల జేబుల్లో వేల కోట్లు చేరాయని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పగలరా? లేక నిశ్శబ్దమే మీ సమాధానమా అని ట్వీట్ చేశారు.
>
>
>