massive 84 crore gst fraud busted in telangana

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. రూ.84 కోట్ల ఐటీసీ మోసం

5

Published on: 📅 13 Mar 2026, 06:43 PM
Reporter: 🖊 Ramesh Kumar

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్ సందీప్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ఐటీసీ పొందినట్లు విచారణలో తేలింది. అతనికి సంబంధమున్న మరికొన్ని సంస్థల్లో కూడా అక్రమాలు బయటపడడంతో వాటి జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

Sponsored