భారీ

భారీ భూకంపం.. ఫిలిప్పీన్స్లో 69 మంది మృతి

Published on: 📅 01 Oct 2025, 11:07

NRI

ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. బోగో నగరానికి 17 కి.మీ. దూరంలో కేంద్రం నమోదైంది. భూకంపం కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోగా, 147 మంది గాయపడ్డారు. 14 మందికి పైగా భవనాలు కూలి మృతులు పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అధికారులు అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. షాన్ రెమేజియో ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోయింది. హాస్పిటల్, భవనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం సహాయక నిధులు విడుదల చేసింది.

Sponsored