అమెరికాలో కీలక నిధుల బిల్లులకు సెనెట్ ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి గడువు ముగియకముందే బిల్లులు ఆమోదం పొందకపోవడంతో అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం నుంచి (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30) షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని స్థితి. గతంలో 2018-19లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగి, అది అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచింది.