వివాహం తరువాత అత్తింటివారు పుట్టింటికి బతుకమ్మ వాయినం ఇవ్వడం తెలంగాణ సంప్రదాయం. తొలి బతుకమ్మ సందర్భంగా 11 రకాల బతుకమ్మలను కోలలు, నువ్వులు, గోధుమలు, పెసలు, బియ్యం, మినుములతో తయారుచేసి పిండివంటలతోపాటు వాయినంగా ఇస్తారు. నూతన వస్త్రాలు కూడా బహుమతిగా అందిస్తారు. ఈ బతుకమ్మలను మూడు నుంచి ఐదేళ్లపాటు పుట్టింట్లో ఉంచి పెద్ద బతుకమ్మకు ఉపయోగిస్తారు. ఆ తరువాత వెండి బతుకమ్మను అత్తింటికి తీసుకెళతారు. ఇటీవల విదేశాల్లో ఉన్న మహిళలు కూడా వెండి బతుకమ్మలతో పండుగ జరుపుతూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.