మహేశ్‌

మహేశ్‌ వల్ల రూ.2 కోట్లు సెట్ వృథా.. మరీ ఇంత సున్నితమా!

Published on: 29-08-2025

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’. భారీ బడ్జెట్‌తో కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచర్ ప్రస్తుతం సౌత్‌ ఆఫ్రికాలో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో మహేశ్‌, ప్రియాంక చోప్రాతో పాటు ఇతర నటీనటులపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే, షూటింగ్‌కు ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన రూ.2 కోట్ల సెట్ వృధా అయిందట. ఆ సెట్‌లో కొద్ది సేపే ఉండి, వాతావరణ వేడి తట్టుకోలేక మహేశ్‌ షూట్‌ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆ షెడ్యూల్ నిలిచిపోయిందని సమాచారం.

Sponsored