ఏడేళ్ల

ఏడేళ్ల క్రితం యాక్సిడెంట్.. యాంకర్ లోబోకి ఏడాది జైలుశిక్ష

Published on: 29-08-2025

టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకి రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైనందుకు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018 మే 21న వరంగల్‌ నుంచి హైదరాబాద్ వెళ్తూ, రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కారు బోల్తా పడటంతో లోబో సహా ఇతరులకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా ఇప్పుడు కోర్టు తీర్పు వెలువరించింది.

Sponsored