మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఉప ఎన్నికల రోడ్‌మ్యాప్‌లు, ప్రచార వ్యూహాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపుల ఎంఎల్‌ఏల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు బీఆర్‌ఎస్‌లోని వివిధ ప్రాంతాల ఇన్‌చార్జులతో కేసీఆర్ గురువారం సమావేశం కానున్నారు.