న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి కివీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 6 ఫోర్లు బాదారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ టీ20ల్లో 1,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.