తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 10 గంటల వరకు సమయం పడుతోందని TTD అధికారులు తెలిపారు. వేంకటేశ్వరుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న మొత్తం 69,254 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 20,954 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా నమోదైనట్లు TTD ప్రకటించింది. భక్తులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.