కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఈ చిత్రం జులైలో విడుదల కానుందని టాక్. ఇందులో సూర్య పాత్ర గజినీ తరహాలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సూర్య టాలీవుడ్లోకి నేరుగా అడుగుపెడుతున్నారు. కీలక పాత్రల్లో రాధిక, రవీనా టాండన్, హీరోయిన్గా మమితా బైజు నటిస్తున్నారు.