isha ambani shines on oscars 2026 red carpet

ఆస్కార్‌ 2026 రెడ్‌కార్పెట్‌పై ఈషా అంబానీ మెరుపులు

8

Published on: 📅 16 Mar 2026, 01:01 PM
Reporter: 🖊 Anitha Sharma

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల వేడుకగా గుర్తింపు పొందిన ఆస్కార్ 2026 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె తన భర్త ఆనంద్ పిరమాల్‌తో కలిసి ఈ వేడుకకు హాజరై రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు.

ఈషా అంబానీ ధరించిన వింటేజ్ వాలెంటినో గౌన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో రూపొందించిన ఫాల్ లేదా వింటర్ 2006-2007 కలెక్షన్ గౌన్‌లో ఆమె ప్రత్యేకంగా మెరిశారు. ఈ గౌన్‌కు జతగా ధరించిన చోకర్ స్టైల్ డైమండ్ నెక్లెస్ ఆమె లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.

ఈ వేడుకకు ముందు ఈషా అంబానీ లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ మ్యూజియంతో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ కలిసి పనిచేసే అవకాశాలపై ఆమె చర్చించినట్లు సమాచారం. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంతో పాటు ఇండియన్ సినిమాకు మరింత గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఈషా అంబానీ హాజరవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు ఆమె ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో కూడా పాల్గొని అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆస్కార్ వేదికపై ఆమె హాజరుకావడంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Sponsored