iran restrictions on hormuz strait shake global oil trade

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు

Published on: 📅 07 Mar 2026, 03:16 PM
Reporter: 🖊 Ramesh Kumar

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయినట్లు సమాచారం. సోమవారం నుంచి ఇప్పటివరకు కేవలం 9 నౌకలు మాత్రమే జలసంధిని దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ నౌక కూడా ఉంది. ఈ నౌక పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌కు తీసుకొస్తోంది. దీంతో దేశంలోని ఇంధన నిల్వలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

Sponsored