నలుగురు

నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు.. తల్లి నమ్మకాన్ని నిలబెట్టిన మహాలక్ష్మిలు

Published on: 25-08-2025

18 ఏళ్ల క్రితం ఆ కుటుంబం.. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయింది. పైగా నలుగురు ఆడపిల్లలు.. ఒక మగపిల్లాడు ఉన్నా.. కనీసం ఏదో ఒక పని చేసి తల్లికి ఆసరాగా ఉండేవాడు. కానీ, తల్లి ఒక్కతే నలుగురు కూతుర్లను సాకాలి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. కూతుర్లకు ధైర్యం చెప్పింది. వారిలోని ప్రతిభను గుర్తించి వెన్ను తట్టింది. మీకు నేనున్నాను.. మీరు బాగా చదువుకోండి అని తన రెక్కలు ముక్కలు చేసి వారిని బాగా చదివించింది. ఫలితంగా ఆ ఇంట్లోని నలుగురు ఆడపిల్లలు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లెకు చెందిన సీతప్పగారి మునివెంకటప్ప, గౌరమ్మ దంపతులకు వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష. ఆరుగాలం

Sponsored