ఎంపీ ప్రియా సరోజ్‌తో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైందో.. టీమిండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ రివీల్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ప్రియా సరోజ్‌తో ఎలా ప్రేమలో పడ్డాడో.. ఎలా పరిచయం పెంచుకున్నాడో వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోను తొలిసారి చూశానని, అప్పుడే నచ్చేసిందని రింకూ చెప్పాడు. ఆ తర్వాత ధైర్యం చేసి మెసేజ్ చేశానని.. అప్పటి నుంచి తమ మధ్య లవ్ స్టోరీ కొనసాగుతోందని అన్నాడు.