Andhra Pradesh Ration Distribution From September: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. సెప్టెంబర్ 15 నాటికి 1.46 కోట్ల కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త కార్డులు, చిరునామా మార్పు చేసుకున్నవారికి కూడా రేషన్ అందుబాటులో ఉంటుందని, భవిష్యత్తులో గోధుమలు కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉండటంతో దుర్వినియోగం అరికట్టబడుతుంది
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి రెండు గుడ్‌న్యూస్‌లు.. వచ్చే నెల నుంచి పక్కా, రెడీగా ఉండండి
Published on: 25-08-2025