four youths killed in car overturning out of control

అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. నలుగురు యువకుల మృతి

2

Published on: 📅 31 Mar 2026, 09:14 AM
Reporter: 🖊

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి జాతీయ రహదారి పైనుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ, కందెడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మొత్తం నలుగురు యువకులు మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Sponsored