ధాన్యం

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

Published on: 11-11-2025

తెలంగాణలో వరిధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంట ఉత్పత్తుల కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడంతో పాటు నిల్వ, రవాణా సదుపాయాలు కల్పిస్తూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 45 శాతం ధాన్యం కొనుగోలు చేశారు. రానున్న 4 వారాల్లో మిగిలిన 55 శాతం పూర్తి చేసి 80 లక్షల టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Sponsored