గత పది రోజుల క్రితం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత కాస్త విరామం ఇచ్చిన వరుణుడు.. మళ్లీ విరుచుకుపడుతున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంపై కుండపోత వర్షం పడటంతో సాధారణ జీవనం పూర్తిగా దెబ్బతింది. ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు చెరువులను తలపించగా, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. అధికారులు, పోలీసులు వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రతి అధికారిని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వారిని తక్షణమే ఇళ్ల నుంచి ఖాళీ చేయించండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
Published on: 12-09-2025