ఛత్తీస్‌గఢ్‌లో

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. తెలంగాణకు చెందిన కీలక నేత సహా 10 మంది మావోయిస్ట్‌లు మృతి

Published on: 12-09-2025

దేశంలో మావోయిస్ట్‌ల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా నక్సల్స్‌పై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2026 నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చూస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కువ మంది నక్సల్స్ తలదాచుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలోనే అడవుల్లో భారీ ఎత్తున నక్సల్స్ ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే భారీగా ఎదురు కాల్పులు, ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.

Sponsored