ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం హైదరాబాద్ నగరంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండగల సందర్భంగా చాలా మంది ఆంధ్రావాసులు తెలంగాణ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్తూ ఉంటారు. అయితే స్వగ్రామాలకు వెళ్లాలంటే రైలు సర్వీసుల మీదే ఆధారపడాలి. బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలంటే భారీగా జేబు గుల్ల చేసుకోవాల్సిందే. అందుకే పండగ వేళల్లో రైల్వే శాఖ నడిపే ప్రత్యేక సర్వీసుల కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అలాంటివారి కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడిపించాలని నిర్ణయించింది.
ఏపీవాసులకు రైల్వే శాఖ దసరా గుడ్‌న్యూస్.. భారీగా స్పెషల్ రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే!
Published on: 12-09-2025