హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో.. ఈ ప్రాంతంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. దీనికోసం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో సుమారు 124.36 ఎకరాల భూమిని సేకరించనున్నారు. పరిహారం కోసం రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వల్ల యువతకు స్థానికంగా ఉపాధి లభించడమే కాక.. సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు
ఆ నియోజకవర్గంలో 124.36 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్.. ఇక ఆ ప్రాంతాల దశ తిరిగినట్లే..
Published on: 12-09-2025