T20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా తుది జట్టులో ఇద్దరు మెయిన్ స్పిన్నర్లను ఆడించకూడదని మాజీ క్రికెటర్ ఆర్ అశ్విన్ సూచించారు. ఒక మెయిన్ స్పిన్నర్‌తో పాటు ఒక స్పిన్ ఆల్‌రౌండర్ ఉంటే జట్టు బ్యాలెన్స్ మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు (కుల్దీప్, వరుణ్) ఉంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుందని హెచ్చరించారు. వరుణ్‌ను అవసరమైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలని, అతడిపై అధిక ఒత్తిడి పెట్టకూడదని చెప్పారు. అలాగే అభిషేక్ తన బౌలింగ్‌పై మరింత దృష్టి పెడితే మంచి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని అశ్విన్ తన యూట్యూబ్ వీడియోలో అభిప్రాయపడ్డారు.
T20 WCలో ఇద్దరు మెయిన్ స్పిన్నర్లు అవసరం లేదు: అశ్విన్ సూచన
Published on: 📅 31 Jan 2026, 05:51