రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ సినిమా మరోసారి థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మార్చి 19న ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని మళ్లీ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్లలో ఈ రీ-రిలీజ్ జరుగుతోంది. ఇండియాలో 250 థియేటర్లు, నార్త్ అమెరికాలో కూడా అనేక స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.
‘ధురంధర్’ రీ-రిలీజ్ నిర్ణయం
9
Published on: 📅 12 Mar 2026, 07:08 PM
Reporter: 🖊 Kiran Rao