ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. 'ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి వలన రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది' అన్నారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్.