సీఎం

సీఎం చంద్రబాబుతో భాజపా అధ్యక్షుడు మాధవ్ భేటీ

Published on: 07-11-2025

ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మధుకర్ సచివాలయంలో సమావేశమయ్యారు. వాజ్​పేయీ 150వ జయంతి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించడానికి సంబంధించిన కార్యాచరణను మాధవ్ సీఎంకు వివరించారు. వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలు, వాజ్​పేయీ జయంతి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే, స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్, మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలను ఎన్డీయే ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందించాలని కోరారు.

Sponsored