తిరుపతి జిల్లా, కేవీబీపురం మండలం ఓల్లూరులోని రాయలచెరువు కట్ట బలహీనంగా ఉండటాన్ని రైతులు గమనించారు. అప్రమత్తం చేసేలోపే గురువారం చెరువుకు గండి పడింది. దీంతో వరద నీరు ఒక్కసారిగా పాతపాలెం, కలెత్తూరు, అరందతీవాడ వంటి 5 గ్రామాలను చుట్టుముట్టింది. కొన్ని గ్రామాల్లో 8 అడుగుల మేర ప్రవాహం వచ్చింది, ప్రజలు మిద్దెలపైకి పరుగులు తీశారు. నీటి ఉద్ధృతికి పశుసంపద, ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. సుమారు 2 వేల ఎకరాల వరి, మిర్చి వంటి పంట భూములు ఇసుక మేట వేసినట్లు అధికారులు తెలిపారు.