హైకోర్టును

హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

Published on: 07-11-2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో "తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ" నిర్వహించాలని భావించింది. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. దీనిపై సమాఖ్య నాయకులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫీజు బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కళాశాలల సిబ్బందితో ఈ సభ ఏర్పాటు చేయాలని నవంబర్ 8న సమాఖ్య నిర్ణయించినట్లు తెలిసింది. భోజన విరామం తర్వాత దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది.

Sponsored