సీఎం

సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి

Published on: 07-11-2025

భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వారికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, లోకేశ్ అభినందించారు. ప్రపంచకప్ గెలవడం ద్వారా టీమ్ఇండియా జట్టు సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

Sponsored