భాజపా,

భాజపా, భారత రాష్ట్ర సమితిలే దొంగ ఓట్లు నమోదు చేయించాయి

Published on: 16-10-2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రల ద్వారా దొంగ ఓట్లు నమోదు చేశాయనే అంశంపై విచారణ జరపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్‌ చేశారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన సభ అనంతరం ఆయన మాట్లాడారు. దొంగ ఓట్లపై కాంగ్రెస్ పార్టీనే ఆరోపించడం విడ్డూరమన్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందనే దుగ్ధతోనే ఆ పార్టీల నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దొంగ ఓట్ల తొలగింపు ఎజెండాగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని మంత్రి తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

Sponsored