కర్నూలులో

కర్నూలులో ప్రధాన మోదీ సభ, తరలివెళ్లిన ఆదోని తెలుగు తమ్ముళ్లు

Published on: 16-10-2025

కర్నూలులో నేడు జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు ఆదోని నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ (తెలుగుదేశం పార్టీ) శ్రేణులు తరలివెళ్లాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, సీనియర్ నేత ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. సుమారు 100 ఆర్టీసీ బస్సులు, 100కు పైగా ప్రైవేటు వాహనాల్లో వారు కర్నూలు చేరుకున్నారు. ఆదోని మండలం అరెకల్ వద్ద కార్యకర్తలకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మారుతినాయుడు, వెంకట్ చౌదరి, తిమ్మప్ప, లక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Sponsored