సామాజిక

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు

Published on: 16-10-2025

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ద్వేషపూరిత పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖకి ప్రభుత్వం ఆదేశించింది. కుల, మత, ప్రాంతాల ఆధారంగా పోస్టులు పెట్టేవారిపై ఐపీసీ సెక్షన్ 352(2), (3) ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.

Sponsored