తెలంగాణలో

తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త.. 9.89 లక్షల మందికి బెనిఫిట్..

Published on: 11-09-2025

ఇప్పటికీ చాలా మంది రైతులు తమ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తరతరాల నుంచి ఆ భూములను సాగు చేసుకుంటూ వస్తున్నా వాటిపై పూర్తి హక్కు మాత్రం లేకుండాపోతోంది. దీనికి కారణం వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం. భూమి అమ్మిన వారి పేర్లు, కొన్నవాళ్ల పేర్లకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారి భూమి రిజిస్ట్రేషన్ కావడం లేదు. అయితే ఏదో ఒక అగ్రిమెంట్ లేదా తెల్లకాగితంపై రాసుకున్నా వాటి ద్వారా భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు ఉంటుంది. అలాంటి ప్రక్రియనే సాదాబైనామా అంటారు.

Sponsored