హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది. రాగల మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రయాణాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.