తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. మూసీ, ఈసా నదుల సంగమ స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీని నిర్మించనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సమైక్యతకు, గాంధేయ విలువలకు ప్రతీకగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని.. ఇందులో నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, మ్యూజియం వంటివి ఉంటాయని వివరించారు.
హైదరాబాద్‌లో 98.20 ఎకరాల రక్షణ భూములు తెలంగాణకు బదలాయింపు..? కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి..
Published on: 11-09-2025