Rs 10 Lakhs Fine For Electricity Theft Machilipatnam: ఏపీలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వాడకం పెరిగింది. కొందరు కరెంట్ బిల్లులు తగ్గించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కృష్ణా జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేసి, విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిని గుర్తించారు. అధిక లోడుతో కరెంటు వాడుతున్న 310 మందికి రూ.10.67 లక్షల జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యంపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సంస్థ నష్టపోకుండా ఉండాలంటే అక్రమాలకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు
కరెంట్ విషయంలో ఈ తప్పు చేయొద్దు.. ఏకంగా రూ.10 లక్షలు జరిమానా, కారణం ఏంటో తెలుసా!
Published on: 11-09-2025