ఉపాధి

ఉపాధి హామీ కార్మికులకు అలర్ట్.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్.. లేదంటే డబ్బులు పడవు

Published on: 12-09-2025

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేతి నిండా పని కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి 100 రోజులు పని కల్పిస్తారు. అయితే ఈపథకంలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కై.. నకిలీ హాజరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ హాజరు సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యింది. దీని కోసం సరికొత్త విధానం అమలు చేసేందుకు రెడీ అయ్యింది.

Sponsored