ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తోంంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంతో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలు నడుపుతున్న వారికి, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి తోడ్పాటు ఇస్తోంది.
ఏపీలో మహిళలకు సూపర్ న్యూాస్.. రూ.10వేల నుంచి రూ.2 లక్షలు వరకు ఇస్తారు
Published on: 12-09-2025