ఏపీలో

ఏపీలో ఆ కులాలకు ముందు ఉండే పదం తొలగింపు.. ఉత్తర్వులు జారీ

Published on: 12-09-2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వెనుకబడిన తరగతుల (BC) జాబితాలో గ్రూప్-బీ కింద ఉన్న కొన్ని కులాల పేర్ల నుంచి 'గౌడ్' అనే పదాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడిగ, గౌడ(గమల్ల), కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన(సెగిడి) కులాల పేర్ల నుంచి గౌడ్ పదం తొలగించారు. కులాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలు (Caste Certificates) జారీ చేసేటప్పుడు 'గౌడ్' అనే పదం లేకుండా ఇవ్వాలని ఆదేశించింది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సీసీఎల్‌ఏ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Sponsored