బీసీల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. విజయవాడ తాడిగడపలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో కలిసి చట్టం విధివిధానాలపై సమావేశం నిర్వహించారు. కులం లేదా వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం డ్రాఫ్ట్‌పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఈ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో బీసీ రక్షణ చట్టం.. ఏపీలో తొలి అడుగు
7
Published on: 📅 14 Mar 2026, 05:08 PM
Reporter: 🖊 Suresh Reddy