భారీ బడ్జెట్‌లు పెరుగుతున్న ఈ కాలంలో కేవలం రూ.33 వేలతో సినిమా తీసి దర్శకుడు రాహి అనిల్ బార్వీ సంచలనం సృష్టించారు. ‘మన్-పిశాచ్’ పేరుతో రూపొందిన ఈ ప్రయోగాత్మక చిత్రంలో కేవలం ఇద్దరు నటులు మాత్రమే నటించారు. ఐఫోన్‌తో షూటింగ్ చేసి, ఫొటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి టెక్నాలజీ సహాయంతో సినిమాను పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. స్క్రిప్ట్ కేవలం 60 పేజీలతో రూపొందిన ఈ మూవీ మార్చి 18న నేరుగా యూట్యూబ్‌లో విడుదల కానుంది.
రూ.33 వేలతో సినిమా..! ‘తుంబాడ్’ దర్శకుడి కొత్త ప్రయోగం
7
Published on: 📅 14 Mar 2026, 04:48 PM
Reporter: 🖊 Ramesh Kumar