ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం, మహిళల కోసం సఖీ నివాస్ హాస్టళ్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం పనులకు అదనపు నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వేగం పెంచాలని నిర్ణయించింది.
ఏపీ క్యాబిఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం నిర్మాణానికి ఆమోదంనెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం నిర్మాణానికి ఆమోదం
9
Published on: 📅 13 Mar 2026, 04:10 PM
Reporter: 🖊 Ramesh Kumar