పాకిస్తాన్‌పై

పాకిస్తాన్‌పై గెలిచాక సూర్య పవర్‌ఫుల్ స్పీచ్.. 'ఈ విజయం భారత సైన్యానికి అంకితం'

Published on: 15-09-2025

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్లారు.

Sponsored