చియాన్ విక్రమ్ ... క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టి వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . అభిమానులందరూ ఆయన్ని ముద్దుగా చియాన్ అని పిలుస్తారు. 1966, ఏప్రిల్ 17న చెన్నైలో పుట్టిన విక్రమ్ అసలు పేరు కెన్నడీ జాన్ విక్టర్. 1990లో ఎన్ కాదల్ కన్మణి చిత్రంలో సినీ అరంగ్రేటం చేసిన విక్రమ్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వెంటనే అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో అతిథి పాత్రలు వేస్తూ కెరీర్ కొనసాగించాడు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో హీరోగా నటించి కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.