షర్ట్

షర్ట్ ఎందుకు విప్పావ్ అని మహేశ్‌బాబుని అడగగలరా?.. జర్నలిస్ట్‌కి మంచు లక్ష్మి కౌంటర్

Published on: 16-09-2025

మంచు మోహన్‌బాబు కుమార్తెగానే అందరికీ తెలిసినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు మంచు లక్ష్మి . అమెరికాలో ఎక్కువ కాలం నివసించడంతో ఆమె తెలుగు భాష డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఆమె ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే ట్రోలింగ్ మొదలైపోతుంది. మంచు లక్ష్మికి సామాజిక బాధ్యత ఎక్కువ. ఓ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల స్కూళ్లని ఆమె దత్తత తీసుకున్నారు. కొంతకాలంగా వెండితెరపై కనిపించని ఆమె తాజాగా ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మోహన్‌బాబు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.

Sponsored