రూ.10 కోట్ల డిమాండ్‌తో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ధనుష్-నయనతార వివాదం మధ్య విఘ్నేశ్ శివన్ తాజా వ్యాఖ్యలు మరోసారి కోలీవుడ్‌లో హీట్ పెంచేశాయి. ఒకప్పుడు ధనుష్‌తో ఎంతో బలమైన అనుబంధం ఉన్నానని, ఇప్పుడు ఆ బంధం లేకపోవడం తనకు బాధగా ఉందని చెప్పడం పెద్ద చర్చగా మారింది. తాజా ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ భావోద్వేగంగా స్పందించారు. ధనుష్ అంటే తనకెంతో గౌరవమని, ఆయన పుట్టినరోజే తన తండ్రి చనిపోయిన రోజు కావడంతో ధనుష్‌లోనే తండ్రిని చూసుకున్నానని చెప్పారు. విఐపీ షూటింగ్ సమయంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నానని, ఆయన తిన్నాకే తినేవాడినని చెప్పిన మాటలు ఇద్దరి మధ్య ఒకప్పుడు ఎంత దగ్గర సంబంధం ఉండేదో చూపిస్తున్నాయి. కానీ అదే బంధం ఇప్పుడు పూర్తిగా దూరమైందని ఆయన అంగీకరించడం కథలో అసలు ట్విస్ట్. ఇద్దరి మధ్య సమస్య వచ్చి ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చని, కానీ అది జరగలేదని విఘ్నేశ్ చెప్పడం గమనార్హం. దూరం ఎందుకు వచ్చిందో కూడా తెలియదని చెప్పడం ఈ విభేదాలపై ఇంకా అనుమానాలు పెంచుతోంది. ఈ భావోద్వేగ వ్యాఖ్యలతో పాటు పాత సినిమా రిలీజ్ గాయం కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. పోడాపోడి రిలీజ్ అనేకసార్లు వాయిదా పడిందని, చివరకు అదే రోజు విజయ్ తుపాకీతో బరిలోకి రావడంతో తమ సినిమా పూర్తిగా మునిగిపోయిందని అన్నారు. ఆ ఫ్లాప్ తర్వాత తన ఫోన్ కాల్స్‌కే స్పందన రాలేదని చెప్పడం ఆయన కెరీర్‌పై ఆ దెబ్బ ఎంత తీవ్రంగా పడిందో తెలియజేస్తోంది. ఇదంతా జరుగుతున్న సమయంలో నయనతార డాక్యుమెంటరీ వివాదం మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. నానుమ్ రౌడీ దాన్ సన్నివేశాలు నిర్మాత అనుమతి లేకుండా వాడినట్లు ధనుష్ టీమ్ అభ్యంతరం చెప్పింది. ట్రైలర్‌లో మూడు సెకన్ల విజువల్స్ వాడినందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారని నయనతార బహిరంగంగా వెల్లడించారు. అప్పట్లో విఘ్నేశ్ కూడా సోషల్ మీడియాలో ధనుష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం అదే విఘ్నేశ్ ధనుష్‌పై గౌరవం, బాధ, సిగ్గు అన్న మూడు భావాలు కలిపి మాట్లాడటం చర్చకు దారి తీసింది.
ధనుష్‌పై విఘ్నేశ్ శివన్ షాక్ కామెంట్స్ 10 కోట్ల వివాదం మధ్య పాత బంధం బయటపెట్టాడు
10
Published on: 📅 05 Apr 2026, 05:43 PM
Reported by: 🖊
Eswar Pavan