తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ముందుగా బంగారు వాకిలిలో శ్రీవారి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సహస్ర దీపాలంకార సేవ జరిగింది. కళ్యాణోత్సవం, డోంజ్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. కాగా, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. దేశం ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా బలం పుంజుకోవాలని ఆశీర్వదించారు. నరక చతుర్దశి, దీపావళి పండుగల్లో భక్తులందరికీ సుఖశాంతులు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.