నీటి

నీటి వీధుల్లో.. నూతన అనుభవం

Published on: 21-10-2025

ఉద్యోగ విరామాలు, వారాంతాలు వస్తే కారు, రైలు, విమానాల్లో ప్రయాణించి ఆధ్యాత్మిక క్షేత్రాలు, అడవులు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లడం చాలామందికి అలవాటు. ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త ట్రెండ్‌గా మారిన మెరైన్ టూరిజం అందరినీ ఆకర్షిస్తోంది. ఎటుచూసినా అంతులేని నీలి సముద్రంలో ప్రయాణించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. పర్యాటకులు రెండు, మూడు రోజులు సముద్రంలో గడుపుతూ సూర్యోదయం, సూర్యాస్తమయం, రాత్రి ఆకాశంలోని నక్షత్రాలను వీక్షిస్తూ ఆనందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి వచ్చి అత్యాధునిక క్రూయిజ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది.

Sponsored