తుర్కియేలో, ఏరుబైలు తీరంలోని కొండల మధ్య ఉంది అత్యంత పురాతనమైన టెర్మిస్సస్ నగరం. దాని అద్భుతమైన నిర్మాణాల కారణంగా, ఈ నగరాన్ని అలెగ్జాండర్ కూడా జయించలేకపోయారు. ఒకప్పుడు శక్తిమంతమైన ఈ నగరం ఇప్పుడు శిథిలాల ఆవాసంగా మారింది. ఇక్కడ పెద్ద సమాధులు, నీటి నిల్వ సౌకర్యాలు, ఆలయాలు, కోటగోడలు, ఇంకా చెక్కుచెదరని 2,000 ఏళ్ల మార్కెట్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నాయి. అలాగే, 4,000 మంది కూర్చునే వేదిక కూడా ఉంది.